Saturday, August 2, 2025
E-PAPER
Homeజాతీయంహిమాచల్‌ప్రదేశ్‌కు ఆరెంజ్ అల‌ర్ట్

హిమాచల్‌ప్రదేశ్‌కు ఆరెంజ్ అల‌ర్ట్

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ఇప్పటికే హిమాచల్‌ప్రదేశ్‌ వర్షాలకు అతలాకుతలమవుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ రాబోయే రెండుమూడు రోజులు ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని చంబా, కంగ్రా, మండి మూడు జిల్లాలకు ఐఎండి శుక్రవారం ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈ మూడు జిల్లాల్లో శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హిమాచల్‌ప్రదేశ్‌ వాతావరణశాఖలోని సీనియర్‌ శాస్త్రవేత్త సందీప్‌ కుమార్‌ శర్మ మీడియాకు వెల్లడించారు.

అలాగే కుల్లు, బిలాస్‌పూర్‌, ఉనా, హమీర్‌పూర్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ఆయన జారీ చేశారు. బహుశా రాబోయే రెండు రోజులు (ఆగస్టు 2, 3) బిలాపూర్‌, మండి, సోలాన్‌, సిమ్లా, సిర్మౌర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని శర్మ అన్నారు. ఆ రాష్ట్రంలో ఆగస్టు 6 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది.
కాగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో కురిసిన వర్షాలకు కొండచరియలు విరిగిపడి రోడ్లు ధ్వంసమయ్యాయి. భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -