నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలం పెద్ద ఏడ్గి గ్రామంలో పల్లె దావాఖాన పరిస్థితి విచిత్రంగా మారింది. పల్లె దావాఖాన ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. గతంలో వైద్య సేవలు అందించిన ఎం ఎల్ హెచ్ పి ( MLHP) ఆరు నెలల నుంచి ఆస్పత్రికి రావడం లేదు. ఎవరికి అదనపు బాధ్యతలు కూడా అప్పగించలేదు.
దీంతో ఆరు నెలలుగా గ్రామంలోని పల్లె దావాఖానలో వైద్య సేవలు నిలిచిపోయాయి. వైద్య సేవల కోసం వస్తున్న గ్రామ ప్రజలు మరియు చుట్టూ ప్రక్కల ఉన్న గ్రామాలకు చెందిన ప్రజలు వైద్యుడు లేకపోవడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . డాక్టర్ లేకపోవడంతో రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. పేద ప్రజలకు పల్లె దవఖానాలో వైద్యుడు లేకపోవడంతో ఆర్థికంగా పేదవారైనా గ్రామీణ పల్లె ప్రజలకు జేబులకు చిల్లులు పడుతున్నాయి .ఇప్పటికైనా అధికారులు స్పందించి డాక్టర్ ను నియమించాలని కోరుతున్నారు.
పల్లె దవాఖానాలో కానరాని వైద్యుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES