- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా శక్తి భవనం పనులను శుక్రవారం సెర్ప్ డైరెక్టర్ నవీన్ కుమార్ పరిశీలించారు. మహిళా శక్తి కార్యక్రమంలో 一భాగంగా ఏర్పాటు చేసిన మహిళా శక్తి క్యాంటీన్ , నిర్మాణంలో ఉన్న జిల్లా మహిళా సమాఖ్య నూతన భవనాన్ని ఆయన సందర్శించి, అవసరమైన సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీఓ సురేష్ , అడిషనల్ డీఆర్‌డీఓ, జంగారెడ్డి , సెర్ప్ ప్రాజెక్టు మేనేజర్ రవీందర్ రావు , సెర్ప్ డీపీఎం కరుణాకర్, డీఆర్‌డీఏ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -