నవతెలంగాణ – మాక్లూర్
మండల కేంద్రంలోని ప్రే డే డ్రై డే కార్యక్రమంలో మండల ఎంపీడీఓ బ్రహ్మానందం రెడ్డి శుక్రవారం పాల్గొన్నారు. గ్రామంలోని ఇండ్లలో నీటి నిల్వలను చూసి వాటిని క్రింద పోయించారు. ప్రతి శుక్రవారం డ్రై డే ను పాటించడం ద్వారా విష జ్వరాలు, వ్యాధులు ప్రబలకుండా ఉంటాయని ఎంపీడీఓ యం. బ్రాహ్మనందం పేర్కొన్నారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా వ్యాధులు ఎలా అరికట్టవచ్చని ప్రజలకు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించారు. అనంతరం ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజుల కొకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో వుంచకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ రాకేష్, ఏఎన్ఏం, ఆశ వర్కర్ పాల్గొన్నారు.
ఫ్రైడే డ్రై డేలో పాల్గొన్న ఎంపీడీఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES