– తదుపరి విచారణ 18కి వాయిదా
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈనెల (ఆగస్టు) 18కి వాయిదా వేసింది. గత విచారణలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చినా కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ వైఖరి తెలుసుకునేందుకు మరొక అవకాశమిస్తున్నామని హెచ్చరించింది. బెట్టింగ్ యాప్‌ల నిషేధాన్ని కేంద్రం సమర్థిస్తుందా?, వ్యతిరేకిస్తుందా? ఎలాంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తుందో చూద్దామని సుప్రీంకోర్టు చెప్పింది. తదుపరి విచారణలో మధ్యంతర ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. సినిమా హీరోలు, సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్‌లను ఎండార్స్ చేయకుండా నిషేధం విధించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కె.ఎ పాల్ కోరారు. బెట్టింగ్ యాప్‌లతో ఎంతోమంది యువకులు నష్టపోతున్నారని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి కె.ఎ పాల్ తీసుకెళ్లారు.
బెట్టింగ్ యాప్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES