– గాజాలో 1373 మంది మృతి
– ఇజ్రాయిల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారే అధికం : యూఎన్ వెల్లడి
వాషింగ్టన్ : ఇజ్రాయిల్ యుద్ధంతో పాలస్తీనాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. గాజా ప్రాంతంలో ఇవి మరింత దారుణంగా ఉన్నాయి. ఇక్కడ ఈ ఏడాది మే చివరి నుంచి సహాయం కోసం ఎదురుచూస్తూ 1373మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి(యూఎన్) మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది ఇజ్రాయిల్ మిలిటరీ చేతిలో ప్రాణాలు కోల్పోయారని వివరించటం గమనార్హం. ” మే 27 నుంచి తిండి కోసం చేతులు చాచి 1373 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. ఈ హత్యలలో ఎక్కువ భాగం ఇజ్రాయిల్ మిలిటరీ చేసినదే” అని యూఎన్ మానవ హక్కుల కార్యాలయం వెల్లడించింది. వాస్తవానికి ఇజ్రాయిల్ సృష్టించిన పరిస్థితులతో గాజాలోని ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ సహాయ పంపిణీ కేంద్రాల వద్ద వేలాది మంది ప్రజలు గుమిగూడి ఉంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడ మీడియాకు క్షేత్రస్థాయిలో వెళ్లలేని పరిస్థితులు ఉండటంతో మృతుల సంఖ్య, ఇతరత్రా సమాచారాన్ని పూర్తిగా అందించటంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి, అంటే 22 నెలలుగా గాజాలోకి వస్తువులు (గూడ్స్), ఇతర సాయం చేరకుండా ఇజ్రాయిల్ ఆంక్షలు విధించింది. దీంతో గాజాలో ఆహార, ఇతర నిత్యావసరాలతో పాటు మెడిసిన్, మెడికల్ సప్లైలు, ఇంధనం వంటి వాటికి కొరత ఏర్పడింది. చివరకు ఆస్పత్రులకు కూడా కరెంటు లేకపోవటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇజ్రాయిల్ దాడిలో 11 మంది మృతి
పాలస్తీనాపై ఇజ్రాయిల్ దాడులు మాత్రం ఆగటం లేవు. ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనాలో అక్కడి పౌరుల ప్రాణాలను తీస్తున్నది. తాజాగా ఇజ్రాయిల్ జరిపిన గన్‌ఫైర్, ఎయిర్ స్ట్రైక్స్‌లలో 11 మంది చనిపోయారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. ఇందులో ఇద్దరు పాలస్తీనా ప్రాంతంలోనే ఆహార పంపిణీ కేంద్రం వద్ద తిండి కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఇజ్రాయిల్ దాడిలో మరణించారని వివరించింది. మరో 70 మంది గాయాలపాలైనట్టు తెలిపింది.
సాయం కోసం ఎదురు చూస్తూ..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES