రైతు, వ్యవసాయ కార్మిక సంఘం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కాచం కృష్ణమూర్తి పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు నిర్వహించనున్నట్టు వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యాలయంలో కృష్ణమూర్తి 19వ వర్థంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనేక ఆటుపోట్లు, నిర్బంధాలను ఎదుర్కొంటూ పీడిత ప్రజలకోసం చివరి వరకు పోరాడారని గుర్తు చేశారు. బాంచెన్‌దొరా నీ కాల్మొక్తా అన్నోళ్లతోనే బందూకులు పట్టించారని తెలిపారు. భూస్వాముల భూములను పేదలకు పంచటంలో కీలక పాత్ర వహించారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘానికి అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. ప్రసాద్, బి పద్మ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోభన్ నాయక్, ప్రొఫెసర్ శివ తదితరులు పాల్గొన్నారు.
కృష్ణమూర్తి పోరాట స్ఫూర్తితో భూపోరాటాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES