- Advertisement -
న్యూఢిల్లీ : ఈ ఏడాది జులైలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 7.5 శాతం పెరిగి రూ.1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో రూ.1.82 లక్షల కోట్ల పన్ను వసూళ్లు జరిగాయి. దేశంలో ఇటీవల కాలంలో జీఎస్టీ వసూళ్లు రూ.1.80 లక్షల కోట్లకు తగ్గకుండా కేంద్ర ఖజానాను కళకళలాడేలా చేస్తోన్నాయి. ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇది వరుసగా ఏడోసారి కావడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.2.37 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి.
- Advertisement -