- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతూనే ఉంది. దీంతో సాగర్ నిండు కుండలా మారింది. ఈ క్రమంలో 24 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర, 2 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,09,632 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2,54,519 లక్షల క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 2,54,519 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 585.10 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం 312.0450 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 296.7235 టీఎంసీలుగా ఉంది. ఇక జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
- Advertisement -