Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంరష్యాలో మరోసారి భారీ భూకంపం

రష్యాలో మరోసారి భారీ భూకంపం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రష్యాలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. కురిల్ దీవుల తూర్పు ప్రాంతంలో రిక్టర్ స్కేల్ పై 6.2 తీవ్రతతో భూప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు సెంటర్ ఫర్ నేషనల్ సెస్మాలజీ తెలిపింది. తాజా భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. భూకంప తీవ్రత నేపథ్యంలో స్థానిక అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. తీర ప్రాంతాలను ఖాళీ చేయించారు. తొలుత సునామీ సంభవించే ప్రమాదం ఉండొచ్చని వార్తలొచ్చినప్పటికీ.. అలాంటిదేమీ లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా- రష్యా తీరంలో 8.8 తీవ్రత భూకంపం తర్వాత 16 గంటల్లో 4.4 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగిన ప్రకంపనలు దాదాపుగా 125 వరకు చోటు చేసుకున్నాయి. వీటిలో మూడు ప్రకంపనలు 6.0 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగి ఉన్నాయి. ఇప్పుడు తాజాగా కురిల్ ఐలండ్స్‌లో వచ్చిన భూకంపం కూడా అలాంటిదేనని అధికారులు అంచనా వేస్తోన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -