- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చెన్నైకి చెందిన వైద్య దంపతులు 2023 జూన్‌లో జీటీ హాలిడేస్ సంస్థ ఏర్పాట్లతో హనీమూన్‌కు ఇండోనేసియా వెళ్లారు. అయితే అక్కడి సముద్రంలో బోట్‌లో వారిద్దరూ ఫొటోషూట్‌లో పాల్గొన్న సమయంలో అకస్మాత్తుగా నీట మునిగి, చనిపోయారు. ఈ ఘటనపై చెన్నై వినియోగదారుల కమిషన్ జీటీ సంస్థపై రూ.1.60 కోట్ల జరిమానా విధించింది. గైడ్ నిర్లక్ష్యం, సేవాలోపం కారణంగా వారిద్దరూ మృతిచెందారని తెలిపారు. బాధిత కుటుంబానికి రూ.1.60 కోట్ల పరిహారం ఇవ్వాలని గురువారం ఉత్తర్వులిచ్చింది.
- Advertisement -