- Advertisement -
నవతెలంగాణ – ఆర్మూర్
ఆర్మూర్ నియోజకవర్గలో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర, శ్రమదానం కార్యక్రమంలో మార్పు జరిగినట్టు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి శనివారం తెలిపారు. ఆలూర్ బైపాస్ (గురుడు కాపు సంఘం) సాయంత్రం 04:00 గంటల నుండి ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఆర్మూర్ పట్టణం పాత బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి x రోడ్ మీదుగా పాదయాత్ర చేస్తూ పెర్కిట్ వరకు ఉంటుంది. రాత్రికి పట్టణంలోని కన్వెన్షన్ హాల్ లో బస చేసి, మరుసటి రోజు ఆలూర్ లో శ్రమదానం, అంకాపూర్లో, అక్కడనుండి పట్టణంలోని సి కన్వెన్షన్ హాల్లో సమావేశంలో పాల్గొంటారని తెలిపారు..
- Advertisement -