Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన కోటపాటి

పసుపు పరిశోధన కేంద్రాన్ని సందర్శించిన కోటపాటి

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
కమ్మర్పల్లి మండలం కేంద్రంలోని పసుపు పంట పరిశోధన కేంద్రాన్ని   రైతు నాయకుడు కోటపాటి నరసింహం నాయుడు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తర తెలంగాణ రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని 2007లో ఢిల్లీలో ని జంతర్ మంతర్ లో నిజామాబాద్ , కరీంనగర్ రైతులతో ధర్నా నిర్వహించామని అన్నారు. అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి శరత్ పవర్ ను కలిసి వేడుకోగా.. ఆయన వెంటనే స్పందించి అప్పటి హైదరాబాదులోని ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్  చైన్స్ లర్ తో మాట్లాడి, పసుపు పరిశోధనా  కేంద్రం మంజూరు చేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు.

కమ్మర్పల్లిలో 36 ఎకరాలలో ఏర్పాటు చేయబడిందని అన్నారు. కొండా లక్ష్మణ్  బాపూజీ హార్టీ కల్చర్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తుందని తెలిపారు. దాదాపు 350 ఎకరాల పసుపు రకాలను పండిస్తూ రైతులకు  ప్రయోజన కరమైన రీతిలో అధిక కర్కు మెన్ రకాలను సాగు చేస్తున్నారని తెలిపారు.  పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త  బోర్లకుంట మహేందర్  టెక్నికల్ అసిస్టెంట్ భాస్కర్ లు కోటపాటికి సాగు పద్ధతులను పరిశోధన ఫలితాలను వివరించారు.

ఈ సంవత్సరం వందలాది మంది రైతులకు అధిక కర్కు మెన్ మరియు అధిక  దిగుబడి  ఇచ్చి వంగ డాలను పంపిణీ చేసినట్లు గా వివరించారు. ఈ సందర్భంగా తాము పోరాడి సాధించుకున్న పరిశోధ నా  కేంద్రం సమర్థవంతంగా పనిచేస్తున్న విషయాన్ని గమనించి అక్కడి శాస్త్రవేత్తలను  ఇతర సిబ్బందిని అభినందించారు పరిశోధన కేంద్రాన్ని పసుపు రైతులు తరచుగా సంప్రదించి పరిశోధ నా ఫలితాలను అంది పుచ్చుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో  కొక్కుల విద్యాసాగర్, . రుక్మాజి లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -