Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ఎమ్మెల్సి శంకర్ నాయక్ హాజరై మాట్లాడుతూ.. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పార్టీ కష్టకాలంలో పార్టీకి వెంటనే నిలబడి కార్యకర్తలకు అండగా ఉండి పార్టీ అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేశారని అన్నారు.

ఎల్లప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజా శ్రేయస్సు కొరకు  ఆలోచించే వ్యక్తి సుదర్శన్ రెడ్డి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ లో అనుభగ్నులుగా సుదర్శన్ రెడ్డి గారి ఆలోచనలు పార్టీ కి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. సుదర్శన్ రెడ్డి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నిజామాబాద్ జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఘనత వారిదేనని,అల్లి సాగర్,గుత్ప ఎత్తిపోతల పథకం లక్ష ఎకరాలకు సాగునీరు మరియు త్రాగునీరు తీసుకొచ్చిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  జిల్లాకు చేసిన సేవలు గుర్తు చేస్తూ కొనియాడారు.

అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు మంజూరు చేసిన ఇంజనీరింగ్ కళాశాలలో సుదర్శన్ రెడ్డి పాత్ర కీలకంగా ఉంది అని సుదర్శన్ రెడ్డి ఎల్లప్పుడూ విద్య వైద్యం సాగు త్రాగునీరు అందించే విషయంలో ఎల్లప్పుడూ ముందు ఉంటారని ప్రజల కోసం ఎల్లప్పుడూ ఆలోచించే సుదర్శన్ రెడ్డికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మోహన్ రెడ్డి భగవంతుని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మాజీ పీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంత రెడ్డి రాజారెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, రాష్ట్ర ఎన్ఎస్యుఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ , యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రాజ నరేందర్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్, మహిళా కాంగ్రెస్ నాయకురాలు పోల ఉష, అపర్ణ, మాజీ కార్పొరేటర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -