Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ..

కాంగ్రెస్ కార్యకర్త కుటుంబానికి మంత్రి శ్రీధర్ బాబు పరామర్శ..

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామానికి చెందిన ఆకుల ఓదెలు కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించారు. సంవత్సరం క్రితం మృతుని భార్య ఆకుల ఓదెమ్మ అనారోగ్యంతో మరణించింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అనంతరం మృతుల చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుంట సదానందం,మేనం సతీష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -