Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మేడారంను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలి 

మేడారంను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలి 

- Advertisement -

తుడుం దెబ్బ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల జగన్నాధ రావు డిమాండ్ 
నవతెలంగాణ – తాడ్వాయి 

ములుగు జిల్లా తాడ్వాయి మండలాన్ని రెండుగా విభజన చేసి మేడారం ప్రాంతం, కాటాపూర్ ను ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలి అని జాతీయ ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ములుగు డివిజన్ ప్రధాన కార్యదర్శి కొప్పుల జగన్నాధ రావు డిమాండ్ చేశారు.

మేడారం, రెడ్డి గూడెం, ఊరట్టం, పడిగాపూర్,ఎలుబాక,నార్లపూర్, వెంగ్లాపూర్, గోనేపల్లి, బసగూడెం, తక్కేలా గూడెం, బయక్కపేట, బయక్క పేట్ కొత్తూరు, బసగూడెం, కన్నెపల్లి, సింగారం, కాల్వాపల్లి, జంపగవాయి, కొండయి, మల్యాల మొదలగు గ్రామాలతో మేడారం మండలం గా ఏర్పాటు చేసినట్లు అయితే మేడారం చుట్టు ప్రక్కల ఉన్న సుమారుగా 25 గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వం కార్యాలయం లు అందుబాటులో కి వస్తాయి అని ప్రతి చిన్న పని కి తాడ్వాయి వరకు 25 కిలోమీటర్లు వెళ్లి రావడం దూరం తగ్గుతుందని, ఆర్థికంగా కూడా ఎక్కువ నష్టపోరని, కాటాపూర్ కేంద్రంగా మరో మండలంగా ఏర్పాటు చేస్తే అటు వైపు గ్రామాలకు న్యాయం జరుగుతుంది అని తెలిపారు.

మేడారం మండలం  ఏర్పాటు మీద కాంగ్రెస్ తెరాస బీజేపీ పార్టీ లలో పని చేసే నాయకులు తమ అభిప్రాయాలు చెప్పాలి అని, మేడారం చుట్టూ ప్రక్కల ఉన్న కాంగ్రెస్ బీజేపీ తెరాస అన్ని పార్టీ ల నాయకులు అన్ని ప్రజా సంఘాల నాయకులు యువకులు మహిళలు చదువుకున్న మేధావులు అందరు మేడారం మండలం కు మద్దత్తు ఇవ్వాలి అని కోరారు. మేడారం మండలానికి ఎవడైనా అడ్డు వస్తే తొక్కుకుంట వెళ్తాము అని హెచ్చరించారు. ఏ పార్టీ అయినా మేడారానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన చెందారు. మేడారాన్ని మండలంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -