నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పలు గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలను ఘనగా నిర్వహించారు. ఈ సందర్భంగా శనివారం సావర్ గావ్ , చిన్న ఎడ్గి గ్రామాలలోని అంగన్వాడి కేంద్రాలలో టీచర్ల ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లిపాల విశిష్టత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పుట్టిన గంటలోపే బిడ్డకు తల్లిపాలు పెట్టాడం వలన తల్లికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు. ముఖ్యంగా తల్లికి ప్రసవ అనంతరం రక్తస్రావం తగ్గుతుందని తెలిపారు.
గర్భాశయం సాధారణ స్థితికి చేరుకుంటుందని, మరియు తల్లికి బిడ్డకు మధ్య బంధం బలపడుతుందని సూచించారు. తల్లిపాలు పట్టడం వలన గర్భసంచి సంకోచించి రక్తస్రావం తగ్గుతుందని తెలిపారు. గర్భాశయం సాధారణ స్థితికి చేరుకుంటుందని, తల్లి బిడ్డల బంధం పెరుగుతుందని, తక్కువ ఇన్ఫెక్షన్లు వస్తాయని, మానసిక ఆరోగ్యానికి మేలు కలుగుతుందని, బిడ్డ ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సార్ గావ్ గ్రామం బుజ్జి బాయి , చిన్న ఏడికి అంగన్వాడీ టీచర్ చంద్రకళ, ఏఎన్ఎం రేష్మ, అశోక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల్లో తల్లిపాల వారోత్సవాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES