నవతెలంగాణ – ముధోల్
ఆర్జీయూకేటీ బాసరలో జిల్లా న్యాయ సేవా సంస్థ, నిర్మల్ సమన్వయంతో “ర్యాగింగ్ నివారణ, మాదకద్రవ్యాల విపత్తు నివారణ” పై న్యాయ అవగాహన కార్యక్రమాన్ని శనివారం రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి, సీనియర్ సివిల్ జడ్జి రాధిక, వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్, భైంసా మేజిస్ట్రేట్ శ్రీ దేవేంద్ర బాబు, ఓఎస్డి ప్రొఫెసర్ మురళీధర్షన్ , బైంసా ఏఎస్పీ అవినాష్ లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్ గోవర్ధన్ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ “మా విశ్వవిద్యాలయం డ్రగ్స్, ర్యాగింగ్‌కు పూర్తి వ్యతిరేకంగాఉంటుందన్నారు. క్యాంపస్‌ను ర్యాగింగ్, మాదకద్రవ్య రహితంగా ఉంచడమే మా లక్ష్యం” అని చెప్పారు. సమాజంలో డ్రగ్స్ బారినపడి ఎంతోమంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. జీవితంలో దేన్నైనా ఆడవచ్చు కానీ జీవితంతో ఆడుకోవద్దు అనే సూత్రాన్ని పాటించాలనిసూచించారు. ముఖ్యఅతిథి గా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి మాట్లాడుతూ.. ర్యాగింగ్ అంటే ఏమిటి? దాని ప్రభావాలు ఎలా ఉంటాయి? అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ర్యాగింగ్ ,డ్రగ్స్ వలన జరిగే దుష్పరిణామాలు, ప్రభావాలనువిశ్లేషించారు. ర్యాగింగ్‌పైఫిర్యాదు వచ్చినట్లయితేకఠినంగా శిక్షలు విధించబడతాయని స్పష్టం చేశారు. డ్రగ్స్ చరిత్రను వివరిస్తూ,1832–44లో చైనా-బ్రిటన్ మధ్య జరిగిన డ్రగ్ యుద్ధాలను ప్రస్తావిస్తూ, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మడం, పంపిణీ చేయడం ఎంత ప్రమాదకరమని అన్నారు. ప్రత్యేక అతిథి సీనియర్ సివిల్ జడ్జి రాధిక మాట్లాడుతూ.. “న్యాయ వ్యవస్థను పేదలకు మరింత సమర్థంగా అందించేందుకు న్యాయ సేవా సంస్థ నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టిలు, మహిళలకు న్యాయ పరంగా ఎక్కువగా ఉపయోగపడుతున్నాం” అన్నారు.
న్యాయ పారా వాలంటీర్ల అవసరం ఉన్నందున ఆర్జీయూకేటీ విద్యార్థులు ముందుకొస్తే అవకాశం ఉంటుంది అని తెలిపారు. నిర్మల్ జిల్లాలో 400మంది లీగల్ పారా వాలంటీర్లు పనిచేస్తున్నారని, తెలిపారు. ముఖ్యంగా సీనియర్ సిటిజన్ ఫోరంను పారా వాలంటీర్లుగా ఎంపిక చేశామని వివరించారు. ర్యాగింగ్ విషయంలో మాట్లాడుతూ, 1996లో తమిళనాడులో ఎంబిబిఎస్ విద్యార్థి ఒకరిని సీనియర్‌లు ర్యాగ్ చేయడం వల్ల మృతి చెందిన ఘటన అనంతరం, 1997లో తమిళనాడు ప్రభుత్వం ర్యాగింగ్ నిరోధక చట్టాన్ని తీసుకొచ్చిందని గుర్తు చేశారు.
ర్యాగింగ్ చిన్న ఘటన నుంచి పెద్ద ప్రమాదంగా మారే అవకాశముండడంతో, ఒక్కసారి కూడా ఉపేక్షించకూడదని, ర్యాగింగ్‌కి సంబంధించి ఫిర్యాదులు తప్పనిసరిగా కమిటీకి ఇవ్వాలని, దర్యాప్తు నివేదికను సంస్థాధిపతికి సమర్పించాలని చెప్పారు. ఆనంతరం కార్యక్రమం చివరలో ఓపెన్ ఫోరం నిర్వహించారు .ఇందులో విద్యార్థులు తమ సందేహాలనువ్యక్తీకరించారు.
ప్రదర్శనలుగా సినాప్సిస్‌లు,వీడియోలు, డాక్యుమెంట్లు విద్యార్థులుతిలకించారు.అలాగే ఆర్జీయూకేటి లో బాలికల వసతి గృహాన్ని పరిశీలించి వసతుల కల్పన, సంక్షేమం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత విద్యార్థుల భోజనశాలను పరిశీలించి, వారితో కలిసి న్యాయమూర్తులు భోజనం చేశారు. ఈకార్యక్రమంలో నిర్మల్ కోర్ట్ సూపర్డెంట్ పురుషోత్తం రావు, ముధోల్ సీఐ మల్లేష్, బాసర ఎస్ఐ శ్రీనివాస్, డీన్లు శ్ నాగరాజు, డాక్టర్ విట్టల్, చంద్రశేఖర్ , అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.
మాదకద్రవ్యాల విపత్తు నివారణపై న్యాయ అవగాహన సదస్సు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES