- Advertisement -
నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ పరిధిలోని మటన్,చికెన్ మాంసం వ్యాపారులు, దుకాణం దారులు మున్సిపల్ నియమం నిబంధనలు పాటించకపోతే జరిమానాలు తప్పనిసరి అని కమీషనర్ నాగరాజు హెచ్చరించారు. మాంసం దుకాణ యజమాను విక్రయ దుకాణాలను పరిశుభ్రంగా ఉంచడంలో పోటు గా దుమ్ము, ధూళి పదకుండా రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.
శనివారం ఆయన తన సిబ్బందితో ఆకస్మిక తనిఖీలు చేసారు. శుచి, శుభ్రత పాటించని 6 దుకాణం యజమానులకు ఒక్కొక్కరికీ రూ.1000 లు చొప్పున ఆరు దుకాణాలకు రూ.6 వేలు జరిమానా విధించారు. తిరు తేలు జరిమానా విధించినారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వ్యాపారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, లేని ఎడల వ్యాపారం లైసెన్స్ ను రద్దు చేస్తామని తెలిపారు.
- Advertisement -