Sunday, August 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం..

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కుంభం..

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని పలు గ్రామాలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం  అనిల్ కుమార్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం శంకుస్థాపన చేశారు. అనాజిపురం, రెడ్డి నాయక్ తండా, ఆకుతోట బాయి తండా మచ్చర్లపాడు తండా సూరె పల్లి, బొల్లపల్లి, నాగిరెడ్డిపల్లి, నందనం గ్రామాలలో పర్యటించి సుమారు రెండు కోట్ల 44 లక్షల రూపాయలు హెచ్ఎండి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

అనంతరం బొల్లెపల్లి గ్రామంలో  కామ్రేడ్ రావి నారాయణరెడ్డి కాంస్య విగ్రహానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డమీది వీరస్వామి గౌడ్, మైలారం వెంకటేష్, రావి సురేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ మోడెపు శ్రీనివాస్ గౌడ్, నుచ్చు నాగయ్య యాదవ్, ఎడ్ల శ్రీనివాస్, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -