ప్రత్యేక అధికారి.. ఎం.భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని దుబ్బపేట గ్రామపరిలోగల కస్తూర్బా గాంధీ ఆశ్రమ బాలికల విద్యాలయంలో ఖాళీగా ఉన్న సీట్లను స్పాట్లో భర్తీ చేయడం జరుగుతుందని పాఠశాల ప్రత్యేక అధికారి ఎం.భవాని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం (సిఈసి,ఎంపీహెచ్ డబ్ల్యూ) లకు అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయన్నారు. అర్హత కలిగిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్ అవకాశం కల్పించబడునన్నారు. 6వ తరగతి, మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ వరకు అడ్మిషన్ విధానంలో ముందుగా వచ్చిన విద్యార్థులకు ప్రాధాన్యం ఆధారంగా స్పాట్ అడ్మిషన్లు ఉంటాయన్నారు. విద్యార్థులు,తల్లిదండ్రులు లేదా అభివృద్ధి సంరక్షకులు సంబంధిత డాక్యుమెంట్లతో సహా వెంటనే సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్ 8106613775ను సంప్రదించాలన్నారు.
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో స్పాట్ అడ్మిషన్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES