Sunday, August 3, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅంతర్జాతీయ అనిశ్చితులెదురైనా చైనా ఆర్థిక వ్యవస్థ భేష్‌

అంతర్జాతీయ అనిశ్చితులెదురైనా చైనా ఆర్థిక వ్యవస్థ భేష్‌

- Advertisement -

యూకే చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో అంతర్జాతీయ వాణిజ్య విభాగ డైరెక్టర్‌ స్టీవెన్‌ లించ్‌
లండన్‌ :
అంతర్జాతీయంగా అనిశ్చితులు నెలకొన్నా చైనా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా వుందని ప్రముఖ బ్రిటిష్‌ ఆర్థిక నిపుణుడు వ్యాఖ్యానిం చారు. టారిఫ్‌ వివాదాలు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, సరఫరా చెయిన్‌లో అంతరాయాలు వంటి అనేకానేక అనిశ్చితులు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయని, ఇటువంటి పరిస్థితుల్లో కూడా చైనా ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా, పటిష్టంగా వుందో నిరూపితమైందని బ్రిటిష్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో అంతర్జాతీయ వాణిజ్య విభాగ డైరెక్టర్‌ స్టీవెన్‌ లించ్‌ పేర్కొన్నారు. ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో చైనా ఆర్థిక వ్యవస్థ 5.3శాతం అభివృద్ధి చెందింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఈ ఏడాది పారిశ్రామిక ఉత్పత్తి 6.4శాతం మేరా పెరిగింది. పరికరాల తయారీ రంగం, హైటెక్‌ తయారీ రంగం కూడా సత్వర అభివృద్ధిని నమోదు చేశాయి. ఈ గణాంకాలు నిస్సందేహంగా ఆకట్టుకుంటున్నాయని లించ్‌ వ్యాఖ్యానించా రు. వీటన్నింటిని చూస్తే చైనా ఆర్థిక వ్యవస్థ చాలా డైనమిక్‌గా వుందని, ఇది వ్యూహాత్మకంగా నడిచే ఆర్ధిక వ్యవస్థ అని అర్ధమవుతోందని అన్నారు. అంతర్జాతీయంగా సరఫరా గొలుసులో అంతరా యాలు కలిగినా, అమెరికా టారిఫ్‌లతో ఇబ్బందులెదురైనా వీటన్నింటినీ తట్టుకుని, ఈ ఒత్తిళ్లను విజయవంతంగా ఎదుర్కొని చైనా ఈ ఘనతను సాధించిందన్నారు. అంతర్జాతీ యంగా ఎన్ని ఒడిదుడుకులె దురైనా తట్టుకుని నిలబడే సామర్ధ్యం చైనా ఆర్థిక వ్యవస్థ స్వంతమని దీంతో నిరూపితమైం దన్నారు. భౌగోళికంగా, రాజకీయంగా ఘర్షణలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్ని దేశాలు కట్టుదిట్టమైన రీతిలో రక్షణ చర్యలు తీసుకుంటూ వస్తున్నాయి. కానీ చైనా మాత్రం ఇతర దేశాలతో సహకరించుకుంటూ ముందుకు సాగుతోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -