హైదరాబాద్ : ప్రముఖ మహిళల వ్యాపార సంస్థ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌ఓ) ఆధ్వర్యంలో మొట్టమొదటి జాతీయ ఎఫ్‌ఎల్‌ఓ జాబ్ ఫెయిర్‌ను సికింద్రాబాద్‌లోని అవినాష్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో ఏర్పాటు చేసింది. శనివారం ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, ఎఫ్‌ఎల్‌ఓ మాజీ జాతీయ అధ్యక్షురాలు పింకీ రెడ్డి సంయుక్తంగా ప్రారంభించారు. ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ వైస్ చైర్‌పర్సన్ కామిని సరాఫ్ ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ జాబ్ ఫెయిర్ ఎఫ్‌ఎల్‌ఓ చరిత్రలో తొలి జాతీయ స్థాయి కార్యక్రమంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. తెలంగాణ డిజిటల్ ఎంప్లారుమెంట్ ఎక్స్ఛేంజ్ మద్దతుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఇది మహిళలు, యువతకు నేరుగా ఉద్యోగ, నైపుణ్య అవకాశాలను అందిస్తోందన్నారు.