– ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించి తీరుతాం
– కమీషన్ల కోసమే బీఆర్‌ఎస్ తహతహ
– లోకేశ్‌ను కేటీఆర్ ఎందుకు కలిశారో చెప్పండి
– రైజింగ్ తెలంగాణ ప్రపంచంతో పోటీ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
వరద జలాలతో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తవ్వక ముందే బనకచర్ల ప్రాజెక్టు ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తే ఊరుకునేది లేదని, అడ్డుకొని తీరుతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని రాజుగారి కోట దగ్గర ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శని వారం అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలతో కలిసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు, షాదీ ముబారక్, కల్యాణ లకిë చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ.. కోయిల్‌సాగర్, భీమా, జూరాల, శ్రీశైలంతోపాటు నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేశామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టునూ నిర్మించి తీరుతామని చెప్పారు. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ప్రాజెక్టులన్నీ కమీషన్ల కోసమే మొదలు పెట్టారని ఆరోపించారు. పదేండ్లు అధికారంలో ఉండి ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదన్నారు. కృష్ణానదిపై గత ప్రభుత్వం ఒక్క ప్రాజెక్టు కూడా ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంతో రహస్యంగా కుదుర్చుకున్న ఒప్పందం వల్లే సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా తెలంగా ణకు అన్యాయం చేశారని ఆరోపించారు. అప్పుడే ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఇప్పుడు పక్క రాష్ట్రంతో సమస్యలు వచ్చి ఉండేవి కావన్నారు. లోకేశ్‌తో కేటీఆర్ రహస్యంగా ఎందుకు కలిశారో చెప్పాలన్నారు.
ప్రజాపాలన అందించడంమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైజింగ్ తెలం గాణ ప్రపంచంతో పోటీ పడుతోందన్నారు. ఈ ప్రాంతంలో సాంకేతిక విద్య అందించడం కోసం అడ్వాన్స్ ఐటీఐ పాఠశాలను నిర్మిస్తున్నామన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్ష కోట్లు అందిస్తున్నామన్నారు. సోమశీల సిద్ధేశ్వరం బ్రిడ్జితో పాటు జాతీయ రహదారి నిర్మాణం పూర్తి చేసి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపరుస్తామని చెప్పారు. తెలంగాణలో సాగునీటి సమస్య తీర్చడానికి రాయలసీమ జూరాల మధ్య ఆనకట్ట నిర్మించా ల్సిన అవసరం ఉందన్నారు. పాలమూరుతోపాటు తెలంగాణ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతే బనకచర్లపై ఆలోచన చేయాలని ఏపీకి హితవు పలికారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, రాజేష్‌రెడ్డి, తూడి మేఘారెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మెన్ ఒబెదుల్లా కోత్వాల్, డీసీసీబీ అధ్యక్షులు మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి, సరిత తిరుపతయ్య యాదవ్, జగదీశ్వరరావు, కొడిదల రాము తధితరులు పాల్గొన్నారు.
బనకచర్లను ఆపేది మేమే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES