సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, డీఎస్పీ రాజశేఖర్ రాజు
ముగిసిన డీవైఎఫ్‌ఐ యువ చైతన్య సైకిల్ యాత్ర
నవతెలంగాణ- మిర్యాలగూడ
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి మంచి భవిష్యత్‌ను నిర్మించుకోవాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు అన్నారు. గంజాయి, డ్రగ్స్‌ను నిర్మూలించాలని, మత్తు పదార్థాలను అరికట్టాలని సోషల్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో జులై 24న నకిరేకల్‌లో ప్రారంభమైన యువ చైతన్య సైకిల్ యాత్ర శనివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు. నేటి బాలలే రేపటి దేశ పౌరులని.. అలాంటి యువత చెడు అలవాట్లకు బానిస కావొద్దని సూచించారు. సరదాల కోసం చెడును నేర్చుకుంటే జీవితాలు నాశనం అవుతాయని చెప్పారు. ప్రధానంగా గంజాయి, డ్రగ్స్‌కు దూరంగా ఉండాలన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిషేధించాలని కోరారు. మంచిగా చదివి ఉన్నతస్థానాలకు ఎదిగి తల్లిదం డ్రుల ఆశయాలను నెరవేర్చాలని చెప్పారు. దేశంలో జరుగు తున్న పరిణామాలను ఎప్పటికప్పుడూ యువత అర్థం చేసు కొని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్ మాట్లా డుతూ.. దేశంలో పాలకులు యువతను మతం, మతో న్మాదం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. నిరు ద్యోగం రోజురోజుకూ పెరిగిపోతోందని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని విమర్శించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లం మహేష్, సైన్స్ విజ్ఞానవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మువ్వా రామారావు, సామాజికవేత్త డాక్టర్ మునీర్, కేవీపీఎస్ రాష్ట్ర నాయ కులు రేమిడల పరుశరాములు, సీపీఐ(ఎం) నాయకులు వినోద్ నాయక్, భావండ్ల పాండు, కోడి రెక్క మల్లయ్య, టీయుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నాగమణి తదితరులు పాల్గొన్నారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES