- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ‘హెల్ప్ ది బ్లైండ్ ఫౌండేషన్’ అంధ విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు ఉపకార వేతనాలు అందిస్తోంది. ఇంటర్, డిగ్రీ, పీజీలో మొదటి ఏడాదిలో చేరిన ప్రభుత్వ, ప్రయివేట్ కళాశాలల విద్యార్థులు అర్హులు. శుక్రవారం నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఖాతాల్లోనే జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి, మరిన్ని వివరాలకు 79814 83735 నంబర్‌కు సంప్రదించవచ్చు.
- Advertisement -