- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: జమ్మూకశ్మీర్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం సంభవించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన లఖన్‌పూర్-బసంత్‌పూర్ రహదారిపై చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్‌కు నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -