Monday, August 4, 2025
E-PAPER
Homeనిజామాబాద్దారుణం .. తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్య

దారుణం .. తల్లి, ఇద్దరు కుమార్తెలు హత్య

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: కాకినాడ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సామర్లకోట సీతారామ కాలనీలో గుర్తు తెలియని దుండగులు ఒక మహిళను, ఆమె ఇద్దరు కుమార్తెలను దారుణంగా హత్య చేశారు. నిన్న రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఈరోజు ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను ములపత్తి మాధురి (30), పుష్పకుమారి (5), జెస్సిలోన (4)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -