- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో అన్ని గ్రామాల్లో గత కొన్ని రోజులుగా సామాజిక తనిఖీలు, నిర్వహించిన ఈజీఎస్ పనులపై ఈనెల 5న ప్రజావేదికను నిర్వహించనున్నామని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ తెలిపారు. 29 గ్రామాలలో ఆడిట్ బృందం సభ్యులు చేపట్టిన తనిఖీ ముగిసిందన్నారు. దీనికి సంబంధించి ‘ ఆగస్టు 5 ఉదయం 9 గంటలకు జన్నారం ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ప్రజావేదిక ఉంటుందని తెలిపారు. ఇందులో ఆడిట్ రిపోర్టులపై చర్చించి ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. ఈ ప్రజా వేదికను మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ఉన్న ఆవరణంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలు ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.
- Advertisement -