Monday, August 4, 2025
E-PAPER
Homeఆటలుకొకొ గాఫ్‌కు షాక్‌

కొకొ గాఫ్‌కు షాక్‌

- Advertisement -

– టీనేజర్‌ విక్టోరియా చేతిలో ఓటమి
– కెనడా ఓపెన్‌ 2025 టెన్నిస్‌
మాంట్రియల్‌ (కెనడా) :
గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ విజేత, టాప్‌ సీడ్‌ కొకొ గాఫ్‌ (అమెరికా)కు కెనడా ఓపెన్‌లో చుక్కెదురైంది. 18 ఏండ్ల లోకల్‌ స్టార్‌ ఎంబోకో విక్టోరియా మహిళల సింగిల్స్‌ ప్రీ క్వార్టర్‌ఫైనల్లో కొకొ గాఫ్‌పై మెరుపు విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 6-1, 6-4తో విక్టోరియా సూపర్‌ విక్టరీ సాధించింది. రెండు ఏస్‌లు, నాలుగు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన విక్టోరియా.. అమెరికా స్టార్‌కు ఊహించిన షాక్‌ ఇచ్చింది. మరో మ్యాచ్‌లో ఎలెనా రిబకినా 5-7, 6-2, 7-5తో మూడు సెట్ల సమరంలో డయానపై గెలుపొంది క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ 6-4, 1-0తో ముందంజలో ఉండగా..ఫ్రాన్సిస్కో (అర్జెంటీనా) వాకోవర్‌ ఇచ్చాడు. దీంతో జ్వెరెవ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకున్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు అలెక్సీ పాపిరిన్‌ 4-6, 6-2, 6-3తో హోల్గర్‌ రూనెపై మూడు సెట్ల మ్యాచ్‌లో గెలుపొందాడు. 14 ఏస్‌లు, మూడు బ్రేక్‌ పాయింట్లతో మెరిసిన అలెక్సీ.. పాయింట్ల పరంగా 96-78తో ఆధిపత్యం చెలాయించాడు. టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా) 6-4, 6-2తో వరుస సెట్లలో గాబ్రియల్‌పై ఘన విజయం సాధించి ముందంజ వేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -