Monday, August 4, 2025
E-PAPER
Homeక్రైమ్సౌత్‌ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య

సౌత్‌ క్యాంపస్‌లో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -

– కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలంలో..
నవతెలంగాణ-భిక్కనూర్‌

కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలంలోని బీటీఎస్‌ వద్ద గల తెలంగాణ సౌత్‌ క్యాంపస్‌లో విద్యార్థి హాస్టల్‌ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. క్యాంపస్‌ అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూరు మండలం కిష్టాపూర్‌ గ్రామానికి చెందిన అశ్విని (24) సౌత్‌ క్యాంపస్‌లో ఎం.ఎ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఆదివారం రాత్రి విద్యార్థులందరూ హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లగా అశ్విని హాస్టల్‌ రూమ్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. బయట ఉన్న విద్యార్థులు హాస్టల్‌ గదిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా తలుపులు తీయకపోవడంతో హాస్టల్‌ వార్డెన్‌, విద్యార్థులు తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లారు. అప్పటికే అశ్విని చున్నీతో ఉరేసుకుని కనిపించడంతో కిందికి దించి చికిత్స నిమిత్తం దోమకొండ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యుల పరీక్షించి మరణించినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -