– ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి ప్రియాంక కక్కార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీజేపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆమ్‌ఆద్మీ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జి ప్రియాంక కక్కార్ విమర్శించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాయని ఆరోపించారు. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రజాస్వామ్య విలువల గురించి నిత్యం వల్లె వేసే కాంగ్రెస్ యువనేత రాహుల్ ఆ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో మాత్రం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ ఫిరాయింపుల గురించి రేవంత్ చర్యలను ఎందుకు అదుపు చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టి దొడ్డిదారిన రాష్ట్రంలో అధికారం చేపట్టిన ఆ పార్టీ… వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక మాట, కేంద్రంలో మరో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నందున ఇండియా కూటమి నుంచి బయటకొచ్చినట్టు తెలిపారు. తెలంగాణలో త్వరలో జరగనున్న స్థానిక, ఉప ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఈ సమావేశంలో ఆమ్‌ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఏజెంట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES