– ఇద్దరు మృతి, ఒకరికి తీవ్రగాయాలు
నవతెలంగాణ-భువనగిరి
బ్రేక్స్ ఫెయిలవ్వడంతో లారీ అదుపుతప్పి రోడ్డుపై ఉన్న పాన్‌షాప్, టీస్టాల్‌లోకి దూసుకురావడంతో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలోని జగదేవ్‌పూర్ చౌరస్తాలో జరిగింది. పట్టణ ఇన్‌స్పెక్టర్ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్ జిల్లా కోహిర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన చిలమామిడి రామకృష్ణ(35), చిలమామిడి శ్రీసాయి (30) ఆదివారం మధ్నాహం భువనగిరి జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్‌లో ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్‌కు వచ్చారు. స్వీట్స్ కొనుగోలు చేసేందుకు జగదేవ్‌పూర్ చౌరస్తాకు వచ్చి.. కొనుగోలు చేస్తుండగా రాజస్తాన్‌కు చెందిన ఓ లారీ బ్రేక్స్ ఫెయిలవ్వడంతో అదుపు తప్పి పక్కనే ఉన్న పాన్‌షాప్, టీస్టాల్‌లోకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో రామకృష్ణ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీసాయికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు. అదేవిధంగా రామన్నపేట మండలంలోని తుమ్మలగూడెంకు చెందిన శివకు కూడా గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. పాన్‌షాప్, టీస్టాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. పోలీసులు క్రేన్ సహాయంతో లారీని అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బ్రేక్స్ ఫెయిలై దుకాణాలపైకి దూసుకెళ్లిన లారీ
- Advertisement -
- Advertisement -