– జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి
– చందనవెల్లి పారిశ్రామికవాడలో
– నిలోఫర్ టీ పౌడర్ ఫ్యాక్టరీ ప్రారంభం
నవతెలంగాణ-షాబాద్
ఫ్యాక్టరీ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లి పారిశ్రామికవాడలో నూతనంగా నిలోఫర్ బాబురావు నిర్మించిన నిలోఫర్ టీ పౌడర్ ఫ్యాక్టరీని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మెన్ ఎలుగంటి మధుసూదన్‌రెడ్డితో కలిసి ఆదివారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిర్వహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఫ్యాక్టరీల ఏర్పాటుతో పలువురికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుడి మల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మెన్ కావాలి చంద్రశేఖర్, నాయకులు పాల్గొన్నారు.
ఫ్యాక్టరీ ఏర్పాటుతో నిరుద్యోగులకు అవకాశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES