- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ముంబైలో సెల్‌ఫోన్ దొంగతనం ఒక యువకుడి జీవితాన్ని ఛిన్నభిన్నం చేసింది. థానే జిల్లాకు చెందిన గౌరవ్ నికమ్ అనే వ్యక్తి ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్నాడు. రైలు డోర్ దగ్గర నిలబడగా.. ఓ దొంగ, అతడి చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఒక్కసారిగా లాక్కున్నాడు. ఈ క్రమంలో గౌరవ్ అదుపుతప్పి కదులుతున్న రైలులో నుంచి కిందకు జారిపడ్డాడు. అతడి కాలు రైలు చక్రాల కిందపడి నుజ్జునుజ్జయింది. ప్రయాణికుల సమాచారం మేరకు రైల్వే సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -