- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: యెమెన్ తీరంలో ఘోర ఓడ ప్రమాదం జరిగింది. ఇథియోపియన్ వలసలదారులతో కూడిన ఓడ ఒక్కసారిగా నడి సముద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనలో 60మంది మృతి చెందగా 74మంది గల్లంతు అయ్యారు. ప్రమాద సమయంలో మొత్తం ఓడలో 154 మంది ఉన్నారని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు. ఘటన జరిగిన ప్రదేశంలో రక్షణ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గల్లంతైన వారి కోసం అధికారులు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిందని అధికారులు చెప్పారు.
- Advertisement -