Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీసీ బిల్లుకు రజక సంఘం మద్దతు

బీసీ బిల్లుకు రజక సంఘం మద్దతు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు 
దేశరాజధాని ఢిల్లీలో ఈనెల 5,6,7 తేదీల్లో జంతర్ మంతర్ వద్ద బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కేంద్రం బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో వెంటనే ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ తోపాటు పలు పార్టీలు, సంఘాలు చేపడుతున్న ధర్నాకు రజక సంఘము పూర్తి మద్దతును ప్రకటిస్తున్నట్లుగా ఆ సంఘం మండల అధ్యక్షుడు పావురాల ఓదెలు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిసీనా ఇప్పటివరకు బీసీలకు రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కల్పించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగన చేసిందన్నారు. స్థానిక సంస్థలఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామనే హామీ ఇచ్చిందన్నారు.అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు బీసీ బిల్లుకు మద్దతు ప్రకటించాయని,పార్లమెంట్లో కూడా బీసీ బిల్లుకు న్యాయపరమైన రాజ్యాంగ సవరణ చేసి కేంద్ర ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదం తెలుపాలని కోరారు.ఇందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు,మంత్రులు, బిసి సంఘాలు,కుల సంఘాలు,మేధావులు అందరు కలిసి బీసీ బిల్లుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -