Monday, August 4, 2025
E-PAPER
Homeజిల్లాలునవతెలంగాణ రిపోర్టర్ సమ్మయ్య కన్నుమూత

నవతెలంగాణ రిపోర్టర్ సమ్మయ్య కన్నుమూత

- Advertisement -

తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి సీతక్క 
నవతెలంగాణ – మల్హార్ రావు
ములుగు జిల్లా తాడ్వాయి మండల నవతెలంగాణ రిపోర్టర్ సమ్మయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిబద్ధత కలిగిన రిపోర్టర్ సమ్మయ్య మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉంటూ.. పత్రిక రంగానికి వన్నె తెచ్చేలా నిత్యం పని చేస్తూ .. సమ్మయ్య అకాల మరణం చెందడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తూ సమ్మయ్య పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ .. సమ్మయ్య కుటుంబానికి అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -