నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని డోన్గాం స్వగ్రామంలో మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గ్రామస్తుడు శంకరప్ప అనారోగ్య కారణాలు వలన కన్నుమూశారు. సమాచారం అందుకున్న మాజీ ఎమ్మెల్యే హుటాహుటిన తన పనులు వదులుకొని స్వగ్రామం చేరుకున్నారు. మృతుడు శంకరప్ప కుమారుడు బీఆర్ఎస్ నాయకుడు సంతోష అప్ప యువ నాయకుడు రెడ్ క్రాస్ అధ్యక్షుడిగా పని చయడం జరిగింది.
మాజీ ఎమ్మెల్యే మృతుడు శంకరప్ప ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధైర్యపడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని తెలిపారు. అనంతరం అంతిమయాత్రలో శంకరప్ప భౌతిక కాయం ఊరేగింపుగా తీసుకువెళ్తూ మాజీ ఎమ్మెల్యే వైకుంఠధామం వరకు పాడే మోశారు. అంతిమయాత్ర కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు సీనియర్ నాయకుడు నీలు పటేల్ , యువ నాయకుడు వాస్రే రమేష్ , బొల్లి గంగాధర్ , విట్టు పటేల్ , తదితరులు పాల్గొన్నారు.