Monday, August 4, 2025
E-PAPER
Homeజిల్లాలుSFI: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రెండు జతల దుస్తులు అందించాలి: ఎస్ఎఫ్ఐ

SFI: ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రెండు జతల దుస్తులు అందించాలి: ఎస్ఎఫ్ఐ

- Advertisement -

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ, రెసిడెన్సి, గురుకుల పాఠశాల, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు రెండు జతల దుస్తులు పంపిణీ చేయలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు అన్నారు.   సోమవారం రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు రెండు జతల దుస్తులు పంపిణీ చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి కి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లావుడియ రాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏక దుస్తులు పంపిణీ చేశారు కొన్ని పాఠశాలలో ఇప్పటివరకు ఏకరూప దుస్తులు కూడా పంపిణీ చేయలేదు గతంలో ప్రతి సంవత్సరం పాఠశాలలో ప్రారంభం జూన్ లో రెండు జతల దుస్తులను పంపిణీ చేసేవరనీ ఇప్పటికీ పాఠశాలలు ప్రారంభించి రెండు నెలలు గడుస్తున్నా గాని ఏకరూప దుస్తులు కూడా పంపిణీ చేయలేదు జిల్లాలో ఉన్నటువంటి రెసిడెన్సి పాఠశాలకు ఇప్పటివరకు కూడా దుస్తులు అందించలేని పరిస్థితి ఉన్నది.

ఆగస్టు 15 పండుగల జరుపుకునే రోజున పాత దుస్తులతోనే వచ్చే పరిస్థితి ఉన్నది జిల్లాలో ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ, ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థులకు పూర్తిస్థాయిలో పంపిణీ చేయలేదు ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జులై 1 నుంచి 15 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలోని సర్వే నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సర్వేల్లో అన్ని పాఠశాలలో దుస్తుల సమస్య తీవ్రంగా ఉన్నది గతంలో ఇచ్చిన దుస్తులు వేసుకునే పరిస్థితి ఉన్నది ఆగస్టు 15 కల్లా అన్ని ప్రభుత్వ పాఠశాలకు రెండు జతల దుస్తులు పంపిణీ చేయాలన, లేని ఎడల మండలాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరుగుతుందని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆగస్టు 15 వరకు దుస్తులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు ,జిల్లా కమిటీ సభ్యులు బుగ్గ ఉదయ్, మైసూర్ల నరేందర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -