- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ మహా నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. భారీగా కురిసిన వానతో నగర వాసులు తడిసి ముద్దయ్యారు. వర్షానికి వివిధ పనులపై బయటకు వచ్చిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు ప్రారంభించారు.
- Advertisement -