Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

- Advertisement -

నవతెలంగాణ – తిమ్మాజిపేట
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని సోమవారం నగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో సిటిజన్ ఫోరం సభ్యులు వి.రాజశేఖర్ శర్మ, వెంకటయ్యలు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేళ్ల నుండి పెండింగ్ లో ఉన్న ఫీజు రీయంబర్స్ మెంట్స్ నిధులు విడుదల చేయక పోవడం వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకాలు కలుగుతున్నాయని అన్నారు. విద్యార్థుల చదువుల కోసం, సర్టిఫికేట్స్ కోసం కళాశాల యాజమాన్యాల దగ్గరికి వెళితే ఫీజులు కడితే తప్ప సర్టిఫికెట్స్ ఇవ్వలేము అంటున్న పరిస్థితి ఉన్నదని తెలిపారు.

ప్రభుత్వం ఏర్పడి18 నెలలు గడిచినా విద్యార్థులకు ఇవ్వాల్సిన కోట్ల రూపాయల స్కాలర్ షిప్స్ ఫీజు రీయింబర్స్ మెంట్ ఇప్పటికీ ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక పక్క కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం విడుదల చేయకపోతే క్లాసులు నడపకుండా తరగతుల బహిష్కరిస్తున్న దుస్థితి నెలకొన్నదని అన్నారు. ఫీజు బకాయలు విడుదల ఆలస్యం వల్ల, ఒక పక్క తల్లి దండ్రులు ఫీజులు కట్టలేక, ప్రభుత్వం స్కాలర్ షిప్స్ విడుదల చేయక విద్యార్థుల చదువులను మధ్యలోనే ఆపివేస్తు పార్ట్ టైమ్ జాబులు చేసుకుంటున్నారని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి వెంటనే ఫీజు బకాయిల కోసం నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -