Monday, August 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 6న విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా  ..

ఈనెల 6న విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా  ..

- Advertisement -

– మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి..
నవతెలంగాణ – జుక్కల్ 

జుక్కల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో  మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరుతూ.. ఆగస్టు 6న హైదరాబాద్  లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా సిఐటియు నాయకుడు సురేష్ గొండ  తెలిపారు.

ఈ సందర్భంగా చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. సురేష్ గొండ మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికుల 10 నెలల కోడిగుడ్ల బిల్లు , వేతనాలు , వెంటనే వంటకు అవసరమైన వంటగ్యాస్ న ఉచితంగా సరఫరా చేయాలని అన్నారు. కొత్త మెనూ ప్రకారం అదనపు బడ్జెట్ కేటాయించా డిమాండ్ చేస్తూ ఆగస్టు ఆరవ తేదీన చలో హైదరాబాద్ విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నాలు మధ్యాహ్న భోజన  కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పాల్గొనాలని సూచించారు.

మధ్యాహ్న భోజన కార్మికుల ఐదు నెలల వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని , ఇంతకాలం అప్పులు చేసి పెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిఐటియు నాయకుడు సురేష్ గొండ, మహిళా నాయకురాలు సరస్వతి, జుక్కల్ మండల మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -