Monday, August 4, 2025
E-PAPER
Homeజిల్లాలువిద్యార్థినీలచే యోగ ఆసనాలు.. 

విద్యార్థినీలచే యోగ ఆసనాలు.. 

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ : జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/కళాశాల నిజామాబాద్ (నవిపేట్) లో విద్యార్థినీలకు యోగ ఆసనాలు చేయించారు. జిల్లా ఆయుష్ విభాగం ఇన్చార్జి డాక్టర్ జె. గంగా దాస్ మాట్లాడుతూ.. మారుతున్న జీవన విధానంలో ఆయుర్వేద ప్రాధాన్యతను దినచర్య ఋతుచర్య లో మార్పులు, సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఆరోగ్య పరిరక్షణలో ఔషద మొక్కల ప్రాధాన్యతలు, వర్షాకాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు తెలిపారు. డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వ్యాధుల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు. యోగ వైద్యులు డాక్టర్. తిరుపతి విద్యార్థినీలకు యోగ ప్రాముఖ్యత, ప్రాణాయామం వలన కలిగే లాభాలు వివరిస్తూ ఆసనాలు వేయించారు. ఆరోగ్య పరిరక్షణలో యోగ సాధన ముఖ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మకుమారి, ఆయుష్ ఫార్మ సిస్స్ట్స్ లు స్యవనంది పురుషోతం, ఉమా, ప్రసాద్, యోగ శిక్షకుడు రాజేందర్, పారామెడికల్ సిబ్బంది రమేష్, భిక్షపతి, లక్ష్మణ్, ఉపాధ్యాయులు స్టాఫ్ నర్సు సంద్య, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -