ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి
నవతెలంగాణ – మల్హర్ రావు
తల్లిపాలతోనే బిడ్డకు అన్నిరకాలు పోహకాలు అందుతాయని మండల ఐసీడీఎస్ సూపర్ వైజర్ భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మండలంలోని తాడిచర్ల అంగన్ వాడి సెంటర్-3, ఆన్ సాన్ పల్లి సెంటర్-2 గ్రామాల్లోని అంగన్ వాడి టీచర్లు బాలమ్మ, జయప్రద, ప్రమీల ఆధ్వర్యంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యదితిగా సూపర్ వైజర్ హాజరై ఈసందర్భంగా తల్లులు, బాలింతలు, గర్భిణులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. బాలింతలు మొదటి రోజు బిడ్డకు మూర్రుపాలు పట్టించాలన్నారు. ముర్రుపాలతో బిడ్డకు రోగనిరోధక శక్తి పెరుతుందన్నారు. చిన్నారులకు అంగన్ వాడి కేంద్రాల్లో అందించే పోహకాహారాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీలు, చిన్నారులు పాల్గొన్నారు.
తల్లిపాలతోనే బిడ్డకు పోషకాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES