నవతెలంగాణ – పెద్దవంగర
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలను అన్నివిధాలా కాపాడుకుంటానని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అవుతాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాము సత్యనారాయణ తల్లి కమలమ్మ (85) వృద్ధాప్యం తో సోమవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న దయాకర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
కార్యకర్తలే పట్టుకొమ్మలని, ఆపదలో వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య, పాలకుర్తి దేవస్థానం మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్, సీనియర్ నాయకులు శ్రీరామ్ సుధీర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు పోలకొండ కృష్ణమూర్తి శర్మ, మాజీ ఉపసర్పంచ్ కోట అశోక్, కొమురయ్య, సోమనర్సయ్య, దయాకర్, శ్రీకాంత్, రమేష్, అశోక్ తదితరులు ఉన్నారు.
కార్యకర్తలను కాపాడుకుంటా: ఎర్రబెల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES