నవతెలంగాణ-హైదరాబాద్ : భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఒకటైన సిగ్నేచర్ గ్లోబల్ (ఇండియా) లిమిటెడ్, తమ ప్రతిపాదిత రూ. 875 కోట్ల విలువైన దాని దీర్ఘకాలిక నాన్-కన్వర్టిబుల్ డిబెంచర్ (NCD) ఇష్యూకు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ నుండి కేర్ ఏ+ రేటింగ్‌ను పొందినట్లు ఈరోజు వెల్లడించింది.
ఈ రేటింగ్, సిగ్నేచర్ గ్లోబల్ యొక్క కొనసాగుతున్న ప్రాజెక్టుల నుండి దాని బలమైన అమ్మకాలు, కలెక్షన్ ఊపును కొనసాగించే అవకాశం ఉందనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
రియల్ ఎస్టేట్ పరిశ్రమలో కంపెనీ అనుభవం, 146 లక్షల చదరపు అడుగుల కంటే ఎక్కువ నివాస మరియు వాణిజ్య ప్రాంగణాలను అభివృద్ధి చేసిన ట్రాక్ రికార్డ్, కేర్ ఏ+ రేటింగ్‌ను పొందడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
సిగ్నేచర్ గ్లోబల్ యొక్క ప్రస్తుత ప్రాజెక్టులు సకాలంలో డెలివరీ చేయటం , ప్రాజెక్ట్ అభివృద్ధి యొక్క వివిధ దశలలో అంచనా వేసిన వైవిధ్యతను కూడా కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ హైలైట్ చేసింది.
ఆర్డిక సంవత్సరం 2025లో, కంపెనీ బుకింగ్‌లు గత సంవత్సరం తో పోలిస్తే గణనీయంగా 42% పెరిగి రూ. 10,290 కోట్లకు చేరుకోగా, వసూళ్లు 40% పెరిగి రూ. 4,380 కోట్లకు చేరుకున్నాయి. 100 లక్షల చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఏడు కొత్త ప్రాజెక్టులను విజయవంతంగా ప్రారంభించడం ద్వారా ఈ వృద్ధి జరిగింది. ఆర్డిక సంవత్సరం 2025 చివరి నాటికి, కొనసాగుతున్న ప్రాజెక్టులకు బుకింగ్‌లు 83% కంటే ఎక్కువగా ఉన్నాయి. కేర్‌ఎడ్జ్ రేటింగ్స్ ప్రకారం, ఆకర్షణీయమైన బుకింగ్ తీరు ఆరోగ్యకరమైన వసూళ్లకు మద్దతు ఇస్తుందని , రాబోయే సంవత్సరాల్లో కంపెనీ నగదు ప్రవాహాలను బలోపేతం చేస్తుంది.