Monday, August 4, 2025
E-PAPER
Homeతాజా వార్తలుకారు మిస్..బైక్ నుజ్జునుజ్జు..వీడియో

కారు మిస్..బైక్ నుజ్జునుజ్జు..వీడియో

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: హైదరాబాద్ లో సోమ‌వారం వర్షం భయంకరంగా కురుస్తోంది. వాన బీభత్సానికి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో మనిషిలోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనాలు మునిగిపోయాయి. అమీర్ పేట్, మైత్రీవనం ఏరియాల్లో బస్టాప్ లోని కుర్చీలు కూడా మునిగిపోయేలా నీళ్లు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది.

భారీ వర్షానికి పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రి వెనుకవైపు పెద్ద చెట్టు విరిగిపడింది. పంజాగుట్ట-బంజారాహిల్స్ రూట్ లో నిమ్స్ వెను చెట్టు విరిగిపడటంతో ట్రాఫిక్ జాం అయ్యింది. చెట్టు విరిగి బైక్ మీద పడటంతో తుక్కుతుక్కు అయిపోయింది. బైక్ ఇకనుంచి ఉపయోగించలేని విధంగా మారిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -