సెక్టార్ సూపర్ వైజర్ శివరాణి
నవతెలంగాణ – కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం లోని అంకుసాపూర్, బయ్యారం అంగన్వాడీ కేంద్రాలలో మహాదేవ్ పూర్ ప్రాజెక్ట్ సిడిపిఒ రత్న రాధికా రెడ్డి ఆదేశాల మేరకు సెక్టార్ సూపర్ వైజర్ శివరాణి ఆధ్వర్యంలో తల్లి పాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా పిల్లలు, కిశోర బాలికలు, తల్లులతో కలిసి గ్రామంలో భారీ ర్యాలీ తీశారు.
ఈ సందర్బంగా సూపర్ వైజర్ శివరాణి మాట్లాడుతూ పుట్టిన బిడ్డ కు వెంటనే ముర్రు పాలు పట్టించాలని, ఆరు నెలల వరకు బిడ్డ కు ద్రవపదార్థాలు ఇవ్వకూడదనీ, ఒకవేళ ఇచ్చినట్లయితే బిడ్డ కు నీళ్ల విరోచనాలు, న్యూమోనియా, శ్వాసకోశ జబ్బులతో ఇబ్బంది పడుతుంది. అంతేగాక ఊబకాయానికి లోనవడం జరుగుతుంది. బిడ్డ కు తల్లి పాలు ఇవ్వకపోవడం వల్ల తల్లులకు రొమ్ము, అండాశయం క్యాన్సర్ బారిన పడడం జరుగుతుందని, కాబట్టి బిడ్డ కు తప్పకుండా తల్లి పాలు పట్టించాలని తెలిపారు. ఆరు నెలల తరువాత బిడ్డ కు అన్న ప్రాసన చేపించి, అనుబంధ ఆహారం తో పాటు రెండు సంవత్సరాల వరకు తల్లి పాలు తప్పకుండ ఇవ్వాలని బాలింతలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం లో కాటారం సెక్టార్ సూపర్ వైజర్ శివరాణి, ప్రథం స్వచ్చంద సంస్థ కో-ఆర్డినేటర్ గంట సమ్మయ్య, అంగన్వాడీ టీచర్స్ హైమావతి, షాహెదబేగం, శ్రీలత,అంగన్వాడీ హెల్పర్స్ సర్దార్ బి, రహిమత్బి, రామక్క, తల్లులు, గర్భిణీ లు, బాలింతలు, కిశోరబాలికలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.