నవతెలంగాణ – అశ్వారావుపేట
ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ప్రస్తుతానికి పాత కార్డ్ ల్లో కొత్తగా కుటుంబ సభ్యులను మాత్రమే చేర్చి వాటినే కొత్త రేషన్ కార్డ్ లుగా పంపిణి చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ప్రజాపాలన లో అశ్వారావుపేట మండలంలో 30 పంచాయితీల నుండి 1781 మంది కార్డ్ లో సభ్యులు చేర్చడానికి గాను దరఖాస్తు చేసుకున్నారు.సర్వే సిబ్బంది,అధికారుల విచారణ అనంతరం 1729 దరఖాస్తులు అర్హత పొందినట్లు నివేదికలో తెలిపారు.
నూతన కార్డ్ లు విషయం అయి తహశీల్దార్ సీహెచ్వీ రామక్రిష్ణ ను ఆరా తీయగా ప్రస్తుతానికి పాత కార్డ్ ల్లో నూతన సభ్యులు చేర్చిన వారికి మాత్రమే అర్హత పత్రాలను అందిస్తున్నామని,నూతన కార్డ్ లు పంపిణీకి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని తెలిపారు.